తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరిలో 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 8.8, తిర్యానీలో 8.9 డిగ్రీలు సోనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. రాబోయే మరో రెండు మూడురోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. చలికి తోడుగా హైదరాబాద్‌తో సహా పలు చోట్ల పొగ మంచు భారీగా పేరుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also..
Read Also..