గత కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదని, కానీ నేడు తాగునీటితో పాటు సాగునీరు సమృద్ధిగా అందుతూ బంగారంలా రెండు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోతల రాయుుడు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు వచ్చాడని, కరీంనగర్ లో మూడు సార్లు చిత్తుగా ఓడిపోయి అక్కడ చేతకాక హుస్నాబాద్ కు వచ్చాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే రాష్ట్రానికి 35,000 కోట్లు ఆపామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారని, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.
కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో గతంలో 9 గంటల వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నింటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయ్యమని, ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపోడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు ఉన్నారని, ఏ దిక్కుకు, ఎటుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, హుస్నాబాద్ అభివృద్ధికి తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు.
50 వేలకు పైగా మెజారిటీతో సతీష్ కుమార్ గెలవడం పక్క అని జోస్యం చెప్పారు.
కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోండి – మంత్రి హరీష్ రావు
57
previous post