ఇన్నాళ్లు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం చేశారు బిజెపి నాయకులు.మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ గారు కుండ బధ్దలు కొట్టారు.తెలంగాణ బిజెపి నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు.ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారు.మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ నిర్మలా గారు బిజెపి తో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారు.ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడిత్నన్నరు, తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారు.12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నాయి.కేసీఆర్ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాలేదు.రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమే.కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయి.తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారు.5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారు.కాంగ్రెస్, బిజెపి రెండు రైతుల పాలిత శత్రువులు.యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కింది.మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారు.స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా.రెండు పార్టీలు రైతులను దగా చేశాయి.బిజెపి పాలిత యుపి, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారు.ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లో పెట్టారు.బిజెపి కాంగ్రెస్ సంబంధం లేకుండా ఎపీ, మేఘాలయ వంటివి మీటర్లు పెట్టాయి.దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం కేసీఆర్ 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం, 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యం.చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే.బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు.సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్.రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలి.అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
harish rao comments on congress
గత కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదని, కానీ నేడు తాగునీటితో పాటు సాగునీరు సమృద్ధిగా అందుతూ బంగారంలా రెండు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోతల రాయుుడు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు వచ్చాడని, కరీంనగర్ లో మూడు సార్లు చిత్తుగా ఓడిపోయి అక్కడ చేతకాక హుస్నాబాద్ కు వచ్చాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే రాష్ట్రానికి 35,000 కోట్లు ఆపామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారని, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.
కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో గతంలో 9 గంటల వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నింటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయ్యమని, ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపోడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు ఉన్నారని, ఏ దిక్కుకు, ఎటుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, హుస్నాబాద్ అభివృద్ధికి తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు.
50 వేలకు పైగా మెజారిటీతో సతీష్ కుమార్ గెలవడం పక్క అని జోస్యం చెప్పారు.




Total views : 79002