ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి డివిజన్లోని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన కూకట్పల్లినీ నేడు అన్ని రకాలుగా ఎటువంటి సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దానని ఒకప్పుడు కూకట్పల్లిలో ఆడపిల్లలు మంచినీళ్లు కోసం బిందులతో నిలబడి నానావస్తులు పడేవారని నేడు ఆ పరిస్థితి లేకుండా నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లకు లక్షల్లో గ్యాలన్లతో నీటి ట్యాంకులు నిర్మించడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా భూగర్భ నీటి పైప్లైన్ నిర్మాణం చేపట్టామని అంతేకాకుండా పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపారని అన్నారు. నేడు శాంతిభద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారిందని ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కంపెనీలు హైదరాబాదులో తమ పెట్టుబడులు పెట్టి ఇక్కడున్న యువతకు అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కూకట్పల్లిలోని 436 ఏళ్ల చరిత్ర గల రామాలయం పునర్నిర్మాణం ..చిత్తారమ్మ దేవాలయం.. మసీదు.. చర్చిలు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచామని రాబోయే రోజుల్లో కారు గుర్తుపై ఓటు వేసి తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎన్నుకుందామని తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కూకట్పల్లిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద ర్యాలీ..
61
previous post