రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు మిడ్ మానేర్ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ సర్కారు హయాంలో ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాడి తాను అనేక కేసులు ఎదుర్కొన్నానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. నిర్వాసితుల ఉద్యమంలో రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే సత్యం.
గత బిఆర్ఎస్ సర్కారు మిడ్ మానేరు కింద విలువైన భూములను లాక్కొని బాధితులను రోడ్డున పడేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు వారిని అక్కున చేర్చుకుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. నిర్వాసితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగుకాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత…
- బీఆర్ఎస్ ను కాపాడేందుకు రంగంలోకి బీజేపీతెలంగాణ బీజేపీ తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
- మట్టి మాఫియా తో చేతులు కలిపిన అటవీ అధికారులుఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి, కంకర తవ్వకాలను చేపడుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు…
- తెలంగాణలో పొన్నం కొత్త పాలసీతెలంగాణలో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్…
- మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారంతొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం మోడీ ఖాతాలోకి నైజీరియా అతున్నత పురస్కారం. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ కమాండర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి