దేశంలో 24గంటల విద్యుత్ ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో గుర్తు చేశారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్ 2నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు 44వేల 438కోట్లు ఉంటే అప్పు 22వేల 423కోట్లు ఉండేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81వేల 16కోట్లు అవ్వగా ఆస్తుల విలువ 1లక్ష 37వేల 570కోట్ల రూపాయలకు పెంచామన్నారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని ఆస్తులు పెంచామని వివరించారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అంతే కాకుండా ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్ లో జరిగిందని అన్నారు.
విద్యుత్ శాఖ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
74
previous post