భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు హెల్మెట్ లేకుండా ఓ స్కూటీపై యువతి, యువకుడు వెళ్తుండగా ఆవాహనాన్ని ఆపిన భద్రాచలం మహిళ ఎస్సై విజయలక్ష్మి 200 రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆగ్రహించిన యువతి, యువకుడు మేమెవరో తెలుసా మా నాన్న కూడా అటవీ శాఖలో ఉన్నతాధికారి మాకే ఫైన్ వేస్తావా అంటూ విజయలక్ష్మితో ఘర్షణకు దిగారు వారిని ఆ ఎస్ఐ వారిస్తుండగా అది చాలదన్నట్టు ఆ యువతి, యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి పిలిపించడంతో అక్కడికి చేరుకున్న అతను విషయాన్ని తెలుసుకోకుండా ఎస్సై పై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఘర్షణకు దిగాడు. దీంతో ఎస్సై విజయలక్ష్మి నేనేమీ తప్పుగా ప్రవర్తించలేదు డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు హెల్మెట్ లేదని మాత్రమే నేను 200 రూపాయలు రాసాను అంటూ సమాధానం చెబుతుండగానే సదరు అధికారి నీ పేరేంటి అంటూ జులుం ప్రదర్శించాడు.
ఈ తతంగాన్ని అంతా చూస్తున్న జనం పిల్లలకు బుద్ధులు నేర్పాల్సిన తండ్రి తప్పు చేసిన వారిని అలా వెనకేసుకు రావడం సరికాదని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీవారి సేవలో గామి చిత్ర బృందం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి