ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్(KTR). ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధముందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. కె.కె. మహేందర్ రెడ్డితో పాటు కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అవమానించే విధంగా, నిరాధారమైన, అర్థంలేని ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా వచ్చే పరిణామాలను ఎదుర్కొవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి