ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లో ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ(BJP) శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరన్నారు. కానీ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. మేం కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందన్నారు.
ఇది చదవండి: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు…
హైదరాబాద్(Hyderabad) డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. సీఎం పదవిపై పదిమంది మంత్రులు కన్నేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి