మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు భక్తజనం బారులు తీరారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే శుభ గడియలు వచ్చేశాయి. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం కానుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు.
శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు
ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క సమ్మక్క దేవతకు స్వాగతం పలకనున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో.. ఎస్పీ, కలెక్టర్ సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీ పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు వచ్చే సమయంలో ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. అర్ధరాత్రి గద్దెలపై సారలమ్మ కొలువుదీరారు. గద్దెలపై గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరారు. ఇక, మేడారం పరిసరాలు లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.