నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన. కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి. నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే, అది బీజేపీ తో సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది,కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది. పేదల పార్టీ ,ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది.
Nalgonda
చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను వింజమూర్ గ్రామ యువకులు అడ్డుకున్నారు.
గతంలో 2018 సంవత్సరంలో వింజమూరు గ్రామస్థులకు వింజమూరు గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు వేస్తానని రోడ్లు వేస్తేనే ఓట్లు అడుగుతానని వాగ్దానం చేసి రోడ్లు వేయించకపోవడంతో ఆ గ్రామ యువకులు రోడ్లు వేయించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చావని ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓయూ జెఎసి వ్యవస్థాపక సభ్యులు ప్రధానమంత్రి మోడీ బిసి అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం తో మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎనగంటి రాజు నేత ఈ కార్యక్రమంలో ఓయూ జెఏసి వ్యవస్థాపక సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 75 సంవత్సరాలలో ఏ ఒక్క పార్టీ కూడా బీసీ అభ్యర్థులను సీఎం చేస్తానని ప్రకటించలేదు. బిజెపి పార్టీ మాత్రం తెలంగాణలో 80 శాతం ఉన్న 136 ఉపకులాల బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మునుగోడులో బిజెపికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఒక కెసిఆర్ వంద అబద్దాల పేరుతో కరపత్రాలు తయారు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామని తొమ్మిది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను యువతను మోసం చేస్తూనే ఉంది ఏ యొక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుఉద్యోగులు, యువత కోసం ఏ ఒక్క హామీ లేదు యువత ఏ ఒక్కరు కూడా బారాస కు ఓటేయొద్దని తెలిపిన ఓయూ వ్యవస్థాప సభ్యుడు రాజు నేత తెలిపారు.
Read Also..
అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామంలో బిక్కేరు వాగు నుండి ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు.
ఇసుక తరలించడంతో గ్రౌండ్ వాటర్ తగ్గి పంట పొలాలు బీడు బారి ఎడారిగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై యదేచ్చగా ఇసుక తరలించడమేంటని ప్రశ్నించిన రైతులు.
మా గ్రామం నుండి ఇసుక తరలించడం మానుకోవాలని ఇసుక వ్యాపారులపై తిరగబడిన గ్రామస్తులు.
Read Also..
దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Also..
తేనెటీగల దాడిలో పరుగులు తీసిన ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత, కార్యకర్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మొదటి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బాణసంచా కాల్చడం తో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ప్రచార రథం దిగి పరుగులు తీసిన ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత అనంతరం కాన్వాయ్ లోకి వెళ్లి కూర్చున్నారు.
రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని , రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని , తెలంగాణను కేసీఆర్ తప్ప ఎవరికి పాలించే అర్హత లేదన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కి 12 మంది BRS ఎమ్మెల్యే లు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు 12 మంది ఉన్నారని మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయంమని ,ప్రజలు దీవించడానికి సిద్ధంగా వున్నారన్నారు.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 10వ తారీఖు వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించనున్నారు. ఎస్సీ రిజర్వేషన్ నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనున్న అభ్యర్థులు అభ్యర్థులు 5000 రూపాయల డిపాజిట్ రుసుము చెల్లించవలసిందిగా అధికారులు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు. నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాలో రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో కనీసం గ్రామంలో ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేదని, బిఆర్ఎస్ నాయకులకు తమ గ్రామంలో పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ అక్కడ నుంచి పోలిసుల సహాయంతో వెనుతిరగడం జరిగింది.





Total views : 81812