తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం:
పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయిదేళ్ల లోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని పోలియో నివారణ రాష్ట్ర అధికారి వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటినీ విస్మరించకూడదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు, వార్డులలోని ఇళ్లలో తిరుగుతూ చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అత్తమామలపై గన్ ఫైరింగ్ చేసిన కేసును చేధించిన పోలీసులు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.