Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ..

జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ..

by Rama
Atchannaidu

రాష్ట్రంలో సురక్షిత తాగునీరు లభించక ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమని తన లేఖలో పేర్కొన్నారు. కనీసం ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించండి అని సీఎం జగన్ కు హితవు పలికారు. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో మలుపు..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026447
Total views : 150454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.