రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు (EC River)లో యదేచ్చగా ఇసుకాసురులు ఇసుక దందులు నిర్వహిస్తున్నారు. ఈసీ నదిలో నుంచి తీసినా ఇసుకను పక్కనే డంపింగ్ చేసి ఎదేచ్ఛగా అమ్మేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉండిపోతున్నారు. అధికారులు తెలిసి ఇలా చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పటికే వర్షాలు సకాలంలో కురవక వాన నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్న తరుణంలో వాగులో వచ్చిన ఇసుకను పక్కనే డంపింగ్ చేసుకొని అమ్ముతున్నారు.
ఇదేమిటని అడిగే నాధుడు లేకుండా పోయాడు. ఒకప్పుడు ఈసీ నదిలో ఎక్కువ మొత్తంలో ఇసుక ఉండటంతో నదిలో ఉన్న ఇసుకను తీసి ఊట బావిగా ఏర్పరిచి మోటార్ల ద్వారా పంటలు సాగు చేసేవారు. అలాగే చుట్టుపక్కల ఉన్న బోరు బావులు లలో పుష్కలంగా నీరు ఉండేది. అలాగే నది పరివాహక ప్రాంతంలో బోరు బావులలో పుష్కలంగా నీరు ఉండేది కానీ ఇసుక తీసివేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు కూడా ఎండిపోతున్నాయి. దీని అరికట్టే నాథుడే లేడా అని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ఇస్కాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
ఇది చదవండి: గొట్టిపాటి లక్ష్మి భారీ బహిరంగ సభ..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి