ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి :
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టిసారించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఉద్దేశించిన ‘గృహజ్యోతి’, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గ్యారంటీలను ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పథకాల అమలుకు తక్షణమే సన్నద్ధమవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి ‘జీరో’ కరెంట్ బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!
ఇక తెల్ల రేషన్‌కార్డు ఉండి నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడేవారందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల్లో ఎవరైనా రేషన్ కార్డు లేదా ఇతర వివరాలు పొరపాటుగా నమోదు చేసి సరిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు. తప్పులను సవరించుకున్న వారికి తదుపరి నెల నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.