116
ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలు :
ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్ సహా పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం
సుమారు 9 లక్షల 80 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్ తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.