హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ ప్రజల ప్రాణాలకు ఎసరు తెస్తోంది. అందరూ కాకున్నా దాదాపు 90శాతం రోడ్డుపక్కన వ్యాపారాలు, చిరుతిళ్ల సెంటర్లు నాణ్యతను, పరిశుభ్రతను గాలికొదిలేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న మాదాపూర్ వంటి ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోడ్లను ఆక్రమిస్తున్నాయి. అసలే రోడ్లమీద సాఫీగా వెళ్లలేకుండా సాయంత్రమైందంటే చాలు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తుంది. దీనికి తోడు రోడ్లను ఆక్రమించుకుంటున్న స్ట్రీట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఈ ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు నెలనెలా మామూళ్లకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లమీద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాల్సిన కొందరు కిందిస్థాయి పోలీసులు సాయంత్రమైందంటే రోజువారీ వసూళ్లపర్వంలో మునిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, కొందరు ఫుడ్ కోర్టులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కాలం చెల్లిన, కుళ్లిపోయిన పదార్థాలతో తినుబండారాలు తయారుచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన నూనెలు కాకుండా నకిలీ నూనెతో వంటకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిత్యం ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా.. వసూళ్లు, ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది, అధికారులు ఈ ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి