తాగునీటి సమస్య (Drinking water Problem) తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ (Summer Action Plan) ను రూపొందించామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) తెలిపారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని… ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్వహణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతీరోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇతర రాష్ట్రాలలోని తాగునీటి సమస్యను తెలంగాణకు కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన కథనాలు వస్తున్నాయని… కానీ రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా, ప్రధాన జలాశయాలు, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్తో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు.
ఇది చదవండి: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పీఏ అరెస్ట్..
Follow us on: Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి