ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పదేళ్ల కాలంలో కెసిఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్ర వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్ బి ఐ నివేదిక విడుదల చేసిందన్నారు. ఆ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84.2 శాతంతో రెండోస్థానంలో ఉందని తెలిపారు. పుష్కలంగా విద్యుత్, నీటి సౌకర్యం ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎంతో పురోగతిని సాధించామని వినోద్ కుమార్ తెలిపారు.
Read Also..
Read Also..