జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ ఠాణాలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకల్లో భాగంగా స్వయాన ఎస్సై కట్ చేసి తినిపించడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఆపద వస్తే, మేమున్నాం అంటూ భరోసానిచ్చేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చెయ్యాలి, కానీ ఆ ఠాణా ఎస్సై తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సమస్యలపై వచ్చిన ఫిర్యాదారుల పై శ్రద్ద పెట్టడంలో చూపని ఆసక్తి అదే పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసులో నిందితుడైన (రౌడీషీటర్) బర్త్ డే కేక్ కట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రవైట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిబందనలు ఉన్నప్పటికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్సై నిబంధనలు మర్చిపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నత పోలీసు అధికారులు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శక్తి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి