63
మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించుకునే మల్లన్న బోనాల్లో భాగంగా కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయం ఆవరణలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా హాజరై అలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో కొత్త ధాన్యంతో వంటలు వండి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు.