ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డ్ -సీఎం రేవంత్‌..

ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డ్ -సీఎం రేవంత్‌

Advertisements

<p>రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా &OpenCurlyQuote;సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ&period;రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా&comma; ఏ పథకం కింద&comma; ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు&period; తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని&comma; అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు&comma; సీఎస్ రామకృష్ణారావు&comma; సీఎం స్పెషల్ సెక్రటరీ బి&period;అజిత్ రెడ్డి&comma; ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా సమీక్షించారు&period; సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు&period; ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు&period; నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు&period; అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు&period; ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు&comma; ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు&period; టెక్నాలజీపై పట్టున్న&comma; చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు&period; నైపుణ్యాభివృద్ధి&comma; శిక్షణ కార్యక్రమాలతో పాటు&comma; పాస్‌పోర్ట్‌లు&comma; వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే&comma; అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని సీఎం తెలిపారు&period; పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా&comma; ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..