తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

Advertisements

<p>తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త&period;&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది&period; ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె&period; రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో విడుదల చేశారు&period; రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44ఏళ్లకు పెంచారు&period; ఈ వయోపరిమితి సడలింపు&period;&period;ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఈ వయోసడలింపు నిర్ణయం వెనుక నిరుద్యోగుల విజ్ఞప్తులు ఉన్నాయి&period; గతంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులు&comma; ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జరిగిన ఆలస్యం&comma; సకాలంలో నోటిఫికేషన్లు రాకపోవడం వంటి కారణాల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ పరీక్షలు రాయకుండానే వయోపరిమితిని దాటిపోయారు&period; తమకు న్యాయం చేయాలని&comma; వయోపరిమితిని పెంచి మరో ఛాన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ&comma; అభ్యర్థులు ప్రభుత్వానికి వినతులిచ్చారు&period; ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ప్రభుత్వం అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ వయోపరిమితి పెంపు అనేది అన్ని రకాల ఉద్యోగాలకు వర్తించదు&period; రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు &lpar;TGPSC లాంటివి&rpar; విడుదల చేసే సాధారణ సివిల్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు మాత్రమే ఈ 44 ఏళ్ల సడలింపు ఉంటుంది&period; శారీరక దారుఢ్యం&comma; నిర్దిష్ట ప్రమాణాలు అవసరమయ్యే యూనిఫాం సర్వీసులైన పోలీస్&comma; ఎక్సైజ్&comma; ఫైర్&comma; జైళ్లు&comma; అటవీ శాఖల ఉద్యోగాలకు మాత్రం ఈ వయోసడలింపు వర్తించదు&period; ఈ విషయాన్ని ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..