MCHRDలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష…

MCHRDలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

Advertisements

<p>తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి&comma; పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన &OpenCurlyQuote;భారత్ ఫ్యూచర్ సిటీ’ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్‌లో ఆయన పరిశ్రమల శాఖపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు&period; పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్&comma; పరిశ్రమల ఏర్పాటు&comma; ఐటీ పాలసీలపై సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు&period; ఫ్యూచర్ సిటీ డిజైన్లు పూర్తిగా పర్యావరణహితంగా&comma; &OpenCurlyQuote;నెట్ జీరో సిటీ’ తరహాలోనే ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు&period; ఇక్కడి మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని&comma; ఇందులో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు&period; నగరంలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు జరపాలని చెప్పారు&period; వచ్చే జూన్ నెలలోనే ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం టార్గెట్ పెట్టారు&period; ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు&comma; సివిల్ సర్వీస్ అధికారులు&comma; మరియు జర్నలిస్టుల కోసం 500 ఎకరాలను కేటాయించనున్నట్లుగా సీఎం వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..