కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Advertisements

<p>తెలంగాణలో వరి ధాన్యం&comma; మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది&period; ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం&period; మొక్కజొన్న కొనుగోలు&comma; వరి ధాన్యం సేకరణలో ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలన్నారు&period; రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో&comma; కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఏ మేరకు జరుగుతుందనే వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు&period; రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా గన్ని బ్యాగులు&comma; హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు&period; ధాన్యం సేకరణ&comma; మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు&period; ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని సూచించారు&period; అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా గోడౌన్లకు తరలించాలని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి&period;&period;ధాన్యం లోడింగ్‌కు ఒప్పందం ప్రకారం సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు&period; అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడొద్దని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు&period; ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు&period; సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని&comma; ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు&period; ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడదని తెలిపారు&period; గోడౌన్ల సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>అదేవిధంగా ధాన్యం నిల్వ చేసేందుకు రైతుబజార్లు&comma; ఫంక్షన్ హాళ్లను సేకరించి&comma; ధాన్యాన్ని అక్కడికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; వీలును బట్టి అక్కడి నుండి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు ఉండాలన్నారు&period; మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని&comma; రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశించారు&period; అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని&comma; కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ రామకృష్ణా రావు‌కు నివేదిక పంపాలని సీఎం రేవంత్ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..