తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది&period; పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు&period; మే 1&comma; 2026 నుంచి ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి&period; విజిలెన్స్ &amp&semi; ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న శిఖాగోయల్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు&period; అలాగే ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో&comma; ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు&period; ఏడీజీ పర్సనల్ గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ &amp&semi; ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బదిలీ చేశారు&period; ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ జోషిని అత్యంత కీలకమైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు&period; ప్రస్తుత సీపీ సుధీర్ బాబు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది&period; మల్కాజిగిరి సీపీగా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా&comma; ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు&period; ఆయనకు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు&period; SIB ఐజీగా ఉన్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు&period; డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షాన్వాజ్ ఖాసిం ను మల్టీ జోన్-II ఐజీపీగా బదిలీ చేశారు&period; ఐజీపీ గా ఉన్న కార్తికేయకు SIB ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు&period; రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడానికి&comma; ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించడానికి అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది&period; ముఖ్యంగా హోం శాఖలో శిఖాగోయల్ నియామకం&comma; ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి ఎంపిక వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.