ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ..

Advertisements

<p>డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ కొనసాగుతోంది&period; ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌&comma; శ్రీధర్‌బాబు&comma; వివేక్‌&comma; అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు&period; ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు&period;ఆర్టీసీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భట్టి&&num;8230&semi; బీఆర్‌ఎస్‌ పాలనలో ఆర్టీసీ చిన్నాభిన్నమైందన్నారు&period; అప్పటి పాలకులు ఎంత కఠినంగా వ్యవహరించారో మీకందరికీ తెలుసు&period; గత పాలకుల మాదిరిగా మేము వ్యవహరించబోమని భరోసా ఇచ్చారు&period; ఆర్టీసీకి సంబంధించిన పాలన&comma; విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామనీ&period;&period; కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందామని భట్టి అన్నారు&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;మొత్తం 32 డిమాండ్లను జేఏసీ నేతలు మంత్రుల ముందు ఉంచారు&period; ఇప్పటికే 29 డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రకటించిన నేపథ్యంలో&period;&period; మూడు కీలక డిమాండ్లపై మంత్రులు&comma; జేఏసీ నేతలు చర్చిస్తున్నారు&period; ప్రభుత్వంలో విలీనం&comma; కార్మిక సంఘాలకు గుర్తింపు&comma; పీఆర్‌సీపై చర్చలు కొనసాగుతున్నాయి&period; ఆర్టీసీ బోర్డు పరిధిలోని సమస్యలను యాజమాన్యం&comma; ఉద్యోగులు పరిష్కరించుకోవాలని&period;&period; ప్రభుత్వ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని మంత్రులు తెలిపారు&period;ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌&comma; శ్రీధర్‌బాబు&comma; వివేక్‌&comma; అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు&period; సీఎస్‌ రామకృష్ణారావు&comma; ప్రత్యేక సీఎస్‌ వికాస్‌రాజ్‌ కూడా హాజరయ్యారు&period; డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి పట్ల మంత్రులు&comma; జేఏసీ నేతలు సంతాపం ప్రకటించారు&period;<br &sol;>&NewLine;ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు&period; శంకర్‌ గౌడ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు&period; ఆ కుటుంబానికి రూ&period;10 లక్షల సాయం&comma; ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు&period; ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు&period;ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌&period; కార్మికులు ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని&period;&period;ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు&period; అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్‌ అధికారుల కమిటీ సమావేశమైంది&period; ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది&period; శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది&period; జేఏసీ నేతల డిమాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది&period;&period;అప్పటి వరకు చర్చలు ఫలిస్తాయా&quest; లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.