హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్

Advertisements

<p>ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరోసారి హైదరాబాద్ పేరు మారుమోగుతోంది&period; అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది&period; దాదాపు రూ&period;15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో రూపొందుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది&period; షాద్‌నగర్&comma; మేకగూడ ప్రాంతాల్లో విస్తరించిన ఈ డేటా సెంటర్ కేవలం తెలంగాణకే కాదు… దేశ టెక్నాలజీ భవిష్యత్తుకే గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది&period; ప్రపంచవ్యాప్తంగా AI సేవల డిమాండ్ పెరుగుతున్న వేళ… భారతదేశాన్ని AI హబ్‌గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు వేసింది&period; ఈ డేటా సెంటర్ ద్వారా అజుర్ క్లౌడ్ &comma;కోపైలట్ వంటి అత్యాధునిక సేవలకు భారీ మౌలిక సదుపాయాలు లభించనున్నాయి&period; అంతర్జాతీయ స్థాయి డిజిటల్ మౌలిక వసతులతో హైదరాబాద్ మరోసారి గ్లోబల్ టెక్ మ్యాప్‌పై హాట్ టాపిక్‌గా మారుతోంది&period;<&sol;p>&NewLine;<p>కృత్రిమ మేధస్సు యుగంలో డేటా సెంటర్ల ప్రాముఖ్యత ఎంత పెరిగిందో ప్రపంచం చూస్తోంది&period; అదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్ దేశ డిజిటల్ రంగానికి కొత్త దిశ చూపనుంది&period; అజుర్ క్లౌడ్ సేవలు&comma; AI కంప్యూటింగ్&comma; కోపైలట్ ఆధారిత స్మార్ట్ టెక్నాలజీలకు అవసరమైన సర్వర్లు&comma; హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థలు ఈ క్యాంపస్‌లో ఏర్పాటు కానున్నాయి&period; ముఖ్యంగా AI ఆధారిత సేవల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెంటర్ భారత మార్కెట్‌కు కీలక మద్దతు ఇవ్వనుంది&period; తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం&comma; అత్యుత్తమ కనెక్టివిటీ&comma; మౌలిక వసతులు మైక్రోసాఫ్ట్‌ను ఆకర్షించాయి&period; ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ కేవలం ఐటీ నగరంగా కాకుండా… దేశంలోనే అత్యంత శక్తివంతమైన AI &comma; క్లౌడ్ టెక్నాలజీ కేంద్రంగా ఎదగబోతోంది&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఈ మెగా డేటా సెంటర్ ప్రభావం కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కానే కాదు&period; వేలాది ప్రత్యక్ష&comma; పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉంది&period; రియల్ ఎస్టేట్&comma; విద్యుత్&comma; నెట్‌వర్క్ మౌలిక వసతులు&comma; సెక్యూరిటీ&comma; టెక్నికల్ సపోర్ట్ రంగాలకు భారీ ఊతం లభించనుంది&period; ముఖ్యంగా షాద్‌నగర్&comma; మేకగూడ ప్రాంతాలు భవిష్యత్తులో భారీ టెక్ కారిడార్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి&period; మైక్రొసాఫ్ట్ ఈ స్థాయి పెట్టుబడి పెట్టడం ద్వారా హైదరాబాద్‌పై ప్రపంచ టెక్ కంపెనీల విశ్వాసం మరింత బలపడింది&period; ఇప్పటికే గూగుల్&comma; అమెజాన్&comma; ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు తెలంగాణలో కార్యకలాపాలు విస్తరిస్తుండగా… ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్‌తో హైదరాబాద్ దేశ డిజిటల్ రాజధానిగా ఎదుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది&period; AI భవిష్యత్తు కోసం భారత్ సిద్ధమవుతున్న సంకేతంగా ఈ ప్రాజెక్ట్‌ను విశ్లేషిస్తున్నారు నిపుణులు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..