ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.

ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం

Advertisements

<p>జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది&period; కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి&comma; మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది&period; ఆనకట్ట మరమ్మతులు&comma; నీటి విడుదల&comma; పెండింగ్ పనులతో పాటు అక్రమ నీటి వినియోగంపై చర్చ జరిగింది&period;ఆనకట్ట నుంచి కర్ణాటక&comma; తెలంగాణ రాష్ట్రాలకు విడుదల అవుతున్న నీటి పరిస్థితిని అధికారులు సమీక్షించారు&period;ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద పెండింగ్‌లో ఉన్న పనులు&comma; ప్రధాన కాల్వ మరమ్మతులు&comma; కాల్వల నిర్వహణ&comma; ఆనకట్టను బ్యారేజీగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు&period; అలాగే ఆర్డీఎస్‌ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై మూడు రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>కర్ణాటక&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి&period; ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి మాట్లాడుతూ&period;&period; గత 75 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతోందని కేఆర్ఎంబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు&period;తెలంగాణకు కేటాయించిన 15&period;9 టీఎంసీల నీరు పూర్తిస్థాయిలో అందడం లేదని&comma; ఆనకట్టలో సిల్ట్ పేరుకుపోవడం&comma; వరదల కారణంగా దెబ్బతినడం&comma; ప్రధాన కాల్వలకు లైనింగ్ లేకపోవడంతో 87 వేల 500 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..