రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .

Advertisements

<p>విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించారు&period; అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారాయన&period; ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు&period; రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 8 శాతం కేటాయిస్తున్నామని చెప్పారు&period; విద్యాశాఖకు 27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే చదువు రాదనే అనుమానం గతంలో ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; ప్రభుత్వం చేస్తున్న కృషితో ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో 18 వందలకుపైగా విద్యార్థులు చేరారని తెలిపారు&period; ప్రభుత్వ స్కూళ్ల గేట్లకు అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారాయన&period;<&sol;p>&NewLine;<p>మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు&period; ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులే రేపటి రోజున నాయకత్వం వహిస్తారని ఆకాంక్షించారు&period; తనతో పాటు వేదికపై ఉన్న వాళ్లందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారే అని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి&period;<&sol;p>&NewLine;<p>విధ్వంసం నుంచి వికాసం వైపు విద్యను తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో వారి మధ్య కులం అనే గోడలను నిర్మించారని విమర్శించారు&period; కుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినట్లు వివరించారు&period;<&sol;p>&NewLine;<p>140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేక పోతున్నామన్నామని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు&period; సౌత్ కొరియా దేశం తెలంగాణ కంటే చిన్నదని కానీ&&num;8230&semi; వారు 32 గోల్డ్ మెడళ్లు సాధించారన్నారు&period; 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన పతకాలెన్ని అని ప్రశ్నించారు&period; ఈ పరిస్థితిని తిరగరాయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి<&sol;p>&NewLine;<p>క్రీడాకారులకు స్పూర్తి నివ్వాలని ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్‌కి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; దాన్ని సైతం రాజకీయం చేసే కుసంస్కారులు ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన ఆక్షేపించారు&period; గురుకులాల్లో ఉండే విద్యార్థులను ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌ బాల్ ఆడించానని&&num;8230&semi; అది వారికి మధుర జ్ఞాపకంగా నిలిచిపోదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..