అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ

Advertisements

<p>అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది&period; ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను పెకలించి ఎత్తుకెళ్లారు&period; అనంతరం నగదును దోచుకుని మిషన్ పరికరాలను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పొలాల్లో పడేసి పరారయ్యారు&period; కేసునమోదు చేసుకున్న పోలీసులు పలు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు&period; దుండగులు బొలెరో వాహనంలో వచ్చి తాడు సహాయంతో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను లాగి బయటకు తీసుకెళ్లారు&period; ఈ ఘటన మొత్తం ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది&period; దుండగులు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు&period; ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు&period; ఈ క్రమంలో సింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలోని పొలాల్లో ఏటీఎం మిషన్ పరికరాలు గుర్తించారు&period; నగదును తీసుకుని మిషన్‌ను అక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period; ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని బ్యాంకు అధికారులు నిర్ధారించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.