కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై.

కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం-2025పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది&period; ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం&comma; గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్యత్తుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది&period; మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు సీతక్క&comma; తుమ్మల నాగేశ్వరరావు&comma; à°¡à°¾&period;వివేక్ వెంకటస్వామి&comma; ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; గ్రామీణ ఉపాధి&comma; రాష్ట్రాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర నిర్ణయాన్ని న్యాయపరంగా&comma; రాజ్యాంగపరంగా సవాల్ చేయాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది&period;<&sol;p>&NewLine;<p>కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని సబ్ కమిటీ అభిప్రాయప్రడింది&period; దీనివల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు&comma; వ్యవసాయ కార్మికుల జీవన భద్రత తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది&period; ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు&period; జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సముచితం కాదని కమిటీ స్పష్టం చేసింది&period; గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కల్పించిన ఈ చారిత్రాత్మక పథకానికి గాంధీజీ పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసింది&period;<&sol;p>&NewLine;<p>సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను సంప్రదించకుండానే 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడాన్ని కమిటీ తప్పుబట్టింది&period; తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయికి తిరిగి వస్తున్నది కేవలం 40 పైసలే అని&&num;8230&semi;అలాంటప్పుడు వీబీజీ రామ్‌జీ పేరుతో అదనంగా మరో 40 శాతం భారం మోపడం ఏ రకంగా న్యాయమని కమిటీ సభ్యులు ప్రశ్నించారు&period; రాజ్యాంగంలోని ఆర్టికల్ 258&lpar;3&rpar; ప్రకారం కేంద్రం అదనపు భారం మోపితే&comma; ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలని సభ్యులు గుర్తుచేశారు&period; 16à°µ ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చట్టానికి వ్యతిరేకంగా విడివిడిగా కాకుండా&comma; అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సబ్ కమిటీ నిర్ణయించింది&period; ఇందులో భాగంగా కర్ణాటక&comma; కేరళ&comma; జార్ఖండ్&comma; తమిళనాడు&comma; పంజాబ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని మంత్రులు నిర్ణయించారు&period; అవసరమైతే అన్ని రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కమిటీ స్పష్టం చేసింది&period; త్వరలోనే న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి&comma; మరో రెండు మూడు రోజుల్లో సబ్ కమిటీ రెండోసారి సమావేశం కానుంది&period; గ్రామీణ సంక్షేమం&comma; ఉపాధి భద్రతను కాపాడేలా సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కమిటీ వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.