నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బంద్.

నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బంద్

Advertisements

<p>రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని&comma; ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌ను తలపెట్టినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు&period; ఈ బంద్‌కు విద్యార్థులు&comma; తల్లిదండ్రులు&comma; పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు&period; సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను కలిగి ఉండి కూడా ప్రైవేట్&comma; కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు&period; రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో దాదాపు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని&comma; పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు&period; ఉచితంగా 25 శాతం సీట్లు కేటాయించాలనే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని రాంబాబు విమర్శించారు&period; విచ్చలవిడి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని&comma; వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు&period; ఒకే పర్మిషన్‌తో పలు బ్రాంచ్‌లు నడుపుతూ సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు&period; ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని&comma; ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు&period; లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .