జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మహిళ తలలో బులెట్‌ కలకలం.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మహిళ తలలో బులెట్‌ కలకలం

Advertisements

<p>జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఓ మహిళ తలలో బుల్లెట్ బయటపడటం సంచలనం సృష్టించింది&period; తొలుత కర్రలతో జరిగిన దాడిగా భావించిన పోలీసులు&period;&period; స్కానింగ్ రిపోర్టులు చూసి షాక్‌కు గురయ్యారు&period; మెట్‌పల్లి పరిధిలోని మఠంవాడకు చెందిన లక్ష్మి అనే మహిళకు&comma; ఆమె బంధువులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది&period; ఈ క్రమంలోనే ఈ నెల జూన్ 15à°¨ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది&period; ఈ దాడిలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి&period; దాడి జరిగిన సమయంలో బంధువులు కర్రలతో కొట్టడం వల్లే ఆమెకు గాయాలయ్యాయని భావించిన పోలీసులు&comma; ఆ మేరకు కేసునమోదు చేశారు&period; అయితే&comma; లక్ష్మి పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ వైద్యులు ఆమె తలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగుచూసింది&period; లక్ష్మి తల భాగంలో ఒక లోహపు వస్తువు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు&period; వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ఆ లోహపు ముక్కను బయటకు తీశారు&period; అది తుపాకీ బుల్లెట్ అని తేలడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు&period; మహిళ తల నుంచి తీసింది నాటు తుపాకీ బుల్లెట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు&period; దాడికి పాల్పడిన నిందితుల వద్ద కొంతమంది బీహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది&period; సదరు బీహార్ కూలీల ద్వారానే నిందితులు ఉత్తరాది నుంచి ఈ నాటు తుపాకీని తెప్పించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు&period; మహిళ తలలో మెటల్ ఆబ్జెక్ట్ బయటపడటంతో మెట్‌పల్లి పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు&period; హత్యాయత్నం కోణంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు&period; నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.