మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన.

మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన

Advertisements

<p>మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 42 కోట్లతో ఏర్పాటు చేయనున్న ATC కి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు&period; గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని 65 ఐటీఐలు నిధులు లేక నిర్వీర్యమయ్యాయని విమర్శించారు&period; రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఏటీసీలను అభివృద్ధి చేస్తోందన్నారు&period; మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ లభించి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు&period; &period;2 వేల 200 కోట్ల నిధులతో టాటా వారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు&period; ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు&period; గత పాలకులు శిక్షణ&comma; నైపుణ్యాభివృద్ధి&comma; ఉద్యోగ కల్పన వంటి కీలక అంశాలను విస్మరించారని ఆరోపించారు&period; యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.