హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ.

హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ

Advertisements

<p>నిన్నటి వరకు అది ఓ కాలుష్య కాసారం&period; ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధంతో&period;&period; నోరు తెరిస్తే చాలు దూరిపోయే దోమలతో అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది&period; కానీ స్థానిక నాయకుల ప్రోద్బలంతో ఆ జలవనరు కొత్త రూపం సంతరించుకుంటోంది&period; కళ్లు చెదిరే హంగులతో అత్యంత సుందరమైన సరోవరంగా మారనుంది&period; ఇంతకీ ఆ చెరువు ఎక్కడుందో తెలుసా&period; హైదరాబాద్ నాచారం HMT నగర్‌లో&period;<&sol;p>&NewLine;<p>నాచారంలోని పెద్ద చెరువు అంటే అందరికీ గుర్తొచ్చేది భయంకరమైన దుర్వాసన&comma; ప్రాణాంతకమైన దోమల బెడదనే&period; గత నాలుగైదేళ్ల నుంచి అయితే ఆ చుట్టుపక్కల కాలనీల్లో ప్రజలు నివసించలేని దుస్థితి ఏర్పడింది&period; చుట్టుపక్కల కాలనీల చెత్తా చెదారం&comma; వ్యర్థాలు&comma; పరిశ్రమల రసాయనాలు అన్నీ ఇందులోకే చేరడంతో ఈ చెరువు మురికి కూపంగా మారింది&period; విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోయి దోమలకు ఆవాసకేంద్రంగా మారింది&period; దీనిపై అనేకసార్లు స్థానికులు ఆందోళన చేపట్టారు&period; అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ చెరువు సుందరీకరణకు నడుము బిగించింది&period; HMT నగర్ పెద్ద చెరువు దగ్గర 37 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ&comma; సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు&period; ఉప్పల్‌ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు&period; త్వరలోనే మిగతా చెరువుల సుందరీకరణ కూడా పూర్తి చేస్తామని చెప్పారు&period;<br &sol;>&NewLine;ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందే తడవుగా&period;&period; అధికారులు చురుగ్గా పనులు ప్రారంభించారు&period; చెరువులోని మురుగునీటిని బయటకు పంపి గుర్రపు డెక్కను తొలగించే పని చేపట్టారు&period; అలాగే పేరుకుపోయిన అవశేషాలను&comma; బురదను తోడేస్తున్నారు&period; చెరువు కట్టకు కూడా మరమ్మతులు చేపట్టి&&num;8230&semi; మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే దిశగా పనులు చేపట్టారు&period; ఇన్నేళ్లు మురికి కూపంగా ఉన్న HMT చెరువు రూపురేఖలు క్రమంగా మారిపోతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; చిత్తశుద్ధితో పనులు చేపట్టిన ప్రభుత్వాన్ని&comma; నాయకులను అభినందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం&comma; సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్‌లు&comma; పార్కులు&comma; లైటింగ్&comma; విశ్రాంతి ప్రదేశాలు&comma; బతుకమ్మ వేడుకల కోసం ఓ ఘాట్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు&period; ఈ పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటి పెద్ద చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు&period;<br &sol;>&NewLine;ఇంతకాలం సమస్యల వలయంగా నిలిచిన HMT నగర్‌ పెద్ద చెరువు అతి కొద్ది కాలంలోనే సుందరమైన తటాకంగా మారనుండడం&&num;8230&semi; స్థానికుల్లో ఆనందాన్ని నింపుతోంది&period; అన్నీ కుదిరితే&period;&period; వచ్చే బతుకమ్మ వేడుకను ఈ చెరువులోనే సంతోషంగా జరుపుకునేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.