ఖైరతాబాద్‌ మహాగణపతికి కర్రపూజ షురూ.

Advertisements

<p>చూస్తున్నంతలోనే మళ్లీ వినాయక చవితి వచ్చేస్తోంది&period; గణేష్‌ మహరాజ్‌కీ జై అనే నినాదాలతో మార్మోగేందుకు భాగ్యనగరం సన్నద్ధమవుతోంది&period; ప్రధాన మంటపాల్లో కొలువుదీరేందుకు భారీ వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి&period; భాగ్యనగర గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖైరతాబాద్‌ గణేషుడి రూపం కూడా ఖరారైంది&period; ఈ ఏడాది కొలువుదీరే 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది&period; ఈ ఏడాది &OpenCurlyQuote;పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ బడా గణేశుడు దర్శనమివ్వనున్నాడు&period; విగ్రహానికి ఓ వైపు సోమనాథ్‌ జ్యోతిర్లింగం&comma; మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు&period; ఈ ఏడాదితో ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి&period; ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి కర్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.