తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు.

తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు

Advertisements

<p>హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు&period; ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు&period; ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పోస్ట్ చేశారు&period; తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ విధంగా గౌరవాన్ని అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని వెల్లడించారు&period; అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23à°¨ హైదరాబాద్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ పక్కన ఉన్న రోడ్డుకు డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూగా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆవిష్కరించారు&period; కీలక అమెరికా టెక్‌ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్‌&comma; గూగుల్‌&comma; అమెజాన్‌లు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి&period; తెలంగాణ&comma; అమెరికా మధ్య వాణిజ్య&comma; వ్యాపార&comma; పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.