జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్

Advertisements

<p>జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది&period; బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ&comma; ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది&period; నర్మెట సీఐ అబ్బయ్య&comma; ఎస్ఐ షేక్‌ హమీద్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు&period; ఒకే కేసు వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారులు ఏకకాలంలో సస్పెండ్ కావడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; ప్రస్తుతం నర్మెట సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ అబ్బయ్య&comma; ఎస్ఐ షేక్ హమీద్ గతంలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు&period; ఆ సమయంలో పోచన్నపేట గ్రామానికి చెందిన ఒక వివాదాస్పద కేసు విషయంలో వీరిద్దరి తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి&period; బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి&comma; ఇద్దరు అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారంటూ వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదులు అందాయి&period; ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన వరంగల్ సీపీ&period;&period; సదరు కేసుపై అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపించారు&period; ఈ విచారణలో సీఐ అబ్బయ్య&comma; ఎస్ఐ హమీద్ ఇద్దరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు&comma; విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి&period; దీంతో శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గానూ వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు&period; శాఖలో అవినీతికి&comma; అక్రమాలకు తావులేదని&period;&period; విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా ఉన్నతాధికారులు గట్టి సంకేతాలు పంపినట్లయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.