రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

Advertisements

<p>రైతులకు పెట్టుబడి భారం తగ్గించి&comma; వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు&period; వ్యవసాయం దండగ కాదని&comma; పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు&period; హైదరాబాద్ శిల్పకళా వేదికగా రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు&period; ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు&period; &&num;8216&semi;బకాయిలు పెట్టింది బకాసురుడు&&num;8230&semi; కట్టే పాపం మాకా&quest;&&num;8217&semi; అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>వ్యవసాయాన్ని దండగ కాకుండా ఒక పండగలా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసమే అంకితభావంతో కృషి చేస్తున్నామన్నారు&period; హైదరాబాద్‌ శిల్పకళా వేదిక సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రి తుమ్మల తో కలిసి &&num;8216&semi;రైతు భరోసా&&num;8217&semi; నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారు&&num;8230&semi; SPOT<&sol;p>&NewLine;<p>ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుమారు 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే&comma; వారంతా కలిసి చేసిన మొత్తం అప్పు 60 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని&comma; కానీ కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఏకంగా 8&period;11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ&period;2 లక్షల లోపు రుణాలన్నింటినీ విజయవంతంగా మాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; 22 వేల 600 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని గర్వంగా ప్రకటించారు&period; వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అన్నారు&period; కేవలం ఉచిత కరెంట్ కోసమే రూ&period;36 వేల కోట్లు చెల్లించామన్నారు&period; అలాగే వ్యవసాయ పనిముట్ల కోసం ఏటా వెయ్యి కోట్లు&comma; రైతు బీమా ప్రీమియం కోసం ఏటా రూ&period;3&comma;500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి<&sol;p>&NewLine;<p>గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు&comma; మధ్యాహ్న భోజనం డైట్ బిల్లులు&comma; సర్పంచ్‌à°² బిల్లుల బకాయిలు కూడా చెల్లించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టింది కేసీఆర్ అయితే&comma; ఆ బద్నాం మరియు నిందలను మాత్రం ఇప్పుడు తాను మోయాల్సి వస్తోందన్నారు&period; గత పాలకుల విపరీతమైన అప్పుల కారణంగా ఢిల్లీలో సైతం తెలంగాణ పరువు పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు&period;<br &sol;>&NewLine;లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కేవలం మూడేళ్లకే కూలిపోయి &&num;8216&semi;కూలేశ్వరం&&num;8217&semi;గా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి&comma; ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు&period; వానాకాలం పంటల పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా నిధులను సిద్ధం చేసి&comma; మొదటి రోజే 41 లక్షలకు పైగా రైతు కుటుంబాల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలను జమ చేశామన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని&comma; అందులో భాగంగానే రానున్న కేవలం తొమ్మిది రోజుల్లోనే అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామన్నారు భట్టి విక్రమార్క&period;<&sol;p>&NewLine;<p>బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోలిస్తే మా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎక్కువగా ఇస్తోందన్నారు మంత్రి తుమ్మల&period; కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్కులు పొంది&comma; ఇంకా ఈ పథకానికి నమోదు కాని రైతులు ఎవరైనా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు&period; అలాంటి రైతులు జూలై 5à°µ తేదీ లోగా తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారినికలిసి తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే&&num;8230&semi; వారికి కూడా నిధులు విడుదల అవుతాయన్నారు&period; విత్తనాలు&comma; ఎరువుల కొరత లేకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు&period; కేసీఆర్&period;&period; ఒక్కసారైనా రైతు రుణమాఫీని పూర్తి చేశారని అని ధ్వజమెత్తారు&period; దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా&period;&period; నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు&period; కానీ&comma; ఊరూరికి మాత్రం బెల్ట్ షాపులు తెచ్చి తాగులు కల్చర్ తెచ్చాడంటూ సీఎం రేవంత్ రెడ్డి&comma; కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.