అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా.

అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా

Advertisements

<p>ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తున్నదని&period;&period; ఇకపై అత్యాధునిక విమానాలు&comma; రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు&period; హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు&period; ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదని&period;&period; పెట్టుబడులు&comma; పరిశ్రమలు&comma; అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా అని స్పష్టం చేశారు&period; సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత&comma; ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉన్నదన్నారు&period; చిన్న విడిభాగం లోపం సైతం మిషన్‌ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని&period;&period; అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయని చెప్పారు&period; అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు&comma; అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు&comma; ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతున్నదని పేర్కొన్నారు&period; స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఎయిరో&comma; కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు&period; ఫ్రాన్స్&comma; ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని వెల్లడించారు&period; రాష్ట్రంలో ఇప్పటికే 15 వందలకు పైగా ఏరోస్పేస్&comma; డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని తెలిపారు&period; పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు&comma; ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు&period; డీఆర్‌డీఓ&comma; రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు&comma; పరిశోధనా కేంద్రాలు&comma; ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.