యూరియా యాప్‌తో రైతులకు కష్టాలు.

యూరియా యాప్‌తో రైతులకు కష్టాలు

Advertisements

<p>హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా యాప్ తో రైతులు కష్టాలు ఆరంభమయ్యాయి&period; సర్వర్ సమస్యలు&comma; ఓటీపీ ఆలస్యం&comma; ఆధార్ లింకింగ్ లోపాలతో రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది&period; చదువు రాని రైతులు యూరియా బుక్ చేయలేకపోతున్నారు&period; భూ యజమానులు కౌలు రైతులకు ఓటీపీ చెప్పటానికి సంశయిస్తున్నారు&period; యూరియా బుకింగ్ ఓటీపీ అడిగితే అకౌంట్లో నుంచి ఏమైనా డబ్బులు కట్ అవుతాయన్న అనుమానంతో ఓటీపీ చెప్పటం లేదని కౌలు రైతులు వాపోతున్నారు&period; ఎకరాకు నాలుగు బస్తాల యూరియా అవసరమైతే కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారన్నారు&period; పాత పద్దతిలో రైతుల అకౌంట్లో సబ్సిడీ జమచేస్తే నేరుగా ఎరువుల దుకాణంలో కొనుకుంటామంటున్నారు&period; ఇదిలావుండగా జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేలపై చిలుకు బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు&period;యూరియా యాప్ పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ&comma; వాలంటీర్లను కూడా నియమించామని తెలిపారు&period; రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోయినా కీ పాడ్ మొబైల్ ఉన్నా ఓటీపీ చెప్తే ఫ్యాక్స్ సెంటర్లలో వాలంటీర్ బుక్ చేసి రైతులకు యూరియా అందించేందుకు సహాయపడతారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.