జగిత్యాలలో మోతె వాగుపై భూకబ్జాలు.

జగిత్యాలలో మోతె వాగుపై భూకబ్జాలు

Advertisements

<p>జగిత్యాలలో భూ అక్రమార్కుల కన్ను ఇప్పుడు వాగులపై పడింది&period; భూముల ధరలు పెరగడంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జాకు తెరలేపుతున్నారు&period; తాజాగా జగిత్యాల-గొల్లపల్లి రహదారిలోని మోతె వాగు భారీ ఆక్రమణలకు గురవుతోంది&period;ఏడాది పొడవునా నీటితో కళకళలాడే ధరూర్-మోతె వాగులో కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రే మట్టి పోసి ఆక్రమణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది&period; జగిత్యాల జిల్లా అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కాలువ నుంచి ధరూర్ మీదుగా మోతె చెరువు వరకు దాదాపు 8 కిలోమీటర్లు&comma; అక్కడి నుంచి ముప్పాల చెరువు వరకు మరో 4 కిలోమీటర్లు&&num;8230&semi; మొత్తం 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వాగు ఇప్పుడు కబ్జాదారుల బారిన పడుతోంది&period;<&sol;p>&NewLine;<p>ధరూర్ క్యాంపు&comma; పద్మనాయక కల్యాణ మండపం వెనుక భాగం&comma; నర్సింగాపూర్ రోడ్ వంతెన&comma; గోవిందుపల్లె&comma; సాయిరాంనగర్ దిగువ ప్రాంతాలతో పాటు మోతె వంతెన పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు&period;ఎన్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ&&num;8230&semi; కొందరు పట్టాలు చూపిస్తూ భూమి తమదేనంటూ మట్టి నింపి వాగు స్వరూపాన్నే మార్చేస్తున్నారు&period; వర్షాకాలం ముందు ఇలాంటి ఆక్రమణలు కొనసాగితే వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మోతె వాగు ఆక్రమణలు కొత్తవి కావు&period; 2014 తర్వాత ఈ అంశంపై వరుస కథనాలు రావడంతో అప్పటి సబ్ కలెక్టర్ శశాంక స్పందించారు&period; ప్రత్యేక చర్యలు చేపట్టి వాగును ఆనుకుని జరిగిన ఆక్రమణలను పొక్లెయిన్లతో తొలగించారు&period; దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి వాగుకు హద్దులు కూడా ఏర్పాటు చేయించారు&period;అయితే కొంతకాలం సైలెంట్‌గా ఉన్న భూ అక్రమార్కులు&&num;8230&semi; ఇప్పుడు మళ్లీ కబ్జాలకు తెరలేపారు&period; నీటి ప్రవాహానికి ఆనుకుని మట్టి నింపి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన తహసీల్దారు కార్యాలయ భవనం కూల్చివేత శిథిలాలను మోతె వాగులో పడేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది&period; వాగు ఆక్రమణలను అరికట్టాల్సిన రెవెన్యూ శాఖకే చెందిన భవనం శిథిలాలతోనే వాగును పూడ్చివేస్తున్నారంటూ రైతులు&comma; గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>జగిత్యాల జిల్లా తిమ్మాపూర్-రఘురాములకోట రెవెన్యూ గ్రామాల పరిధిలోని ముప్పాల చెరువు నీటి వనరులకు అడ్డుగా ఉన్న ఒర్రెలు&comma; చెరువు ఆక్రమణలను తొలగించాలని రైతులు నిరసన దీక్ష చేపట్టారు&period; ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు&period; చెరువులు&comma; వాగులు&comma; ఒర్రెలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని&comma; ఆక్రమణలను ఉపేక్షించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;<p>వాగు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖకు చెందిన భవనం శిథిలాలనే వాగులో పోసి ఆక్రమణకు పాల్పడటం విచారకరమని రైతులు&comma; మత్స్యకారులు మండిపడుతున్నారు&period; ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు&period;ఇప్పటికైనా ప్రభుత్వం&comma; జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మోతె వాగులో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని&comma; లేకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని గ్రామస్థులు&comma; రైతులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.