ఫ్యూచర్ సిటీని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం-సీఎం రేవంత్

ఫ్యూచర్ సిటీని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం-సీఎం రేవంత్

Advertisements

<p>నాడు బడులను గాలికొదిలేస్తే&period;&period;తాము భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామంటూ గత పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి&period; ఓవైపు ఫ్యూచర్ సిటీ గడపలో ప్రపంచ దిగ్గజం అమెజాన్ ను కూర్చోబెడుతూ&period;&period; మరోవైపు పాలమూరు రైతన్నల సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా రేవంత్ స్పీడ్ పెంచారు&period; అక్కడ ఫ్యూచర్ సిటీ&period;&period; ఇక్కడ ప్రగతి బాట&period;&period; 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల తెలంగాణే తమ టార్గెట్ అంటూ సరికొత్త మైలురాళ్లను సెట్ చేశారు సీఎం&period;<&sol;p>&NewLine;<p>ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి&period; ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ కొత్త డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు&period; అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని&comma; దీనివల్ల మరిన్ని పెట్టుబడులు&comma; అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు&period; గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు 108 దేశాల నుంచి పరిశ్రమలు పాల్గొన్నాయని గుర్తు చేశారు&period; 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు&period; ఈ లక్ష్య సాధనకు భారీ పెట్టుబడులు&comma; మౌలిక సదుపాయాలు&comma; ఉపాధి అవకాశాలు అవసరమని&comma; అందుకే తెలంగాణ రైజింగ్ విధానాన్ని తీసుకొచ్చామని రేవంత్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు సీఎం సీఎం రేవంత్‌రెడ్డి&period; ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరలేదని&period;&period; ఎక్కువ మంది ప్రైవేటుకు వెళ్లారన్నారు&period; తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని రేవంత్‌ చెప్పారు&period; వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్‌ భవనాల ప్రారంభం సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు&period; విద్య ప్రాధాన్యతను గుర్తించే తాను విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని తెలిపారు&period; రాజకీయ నాయకుల వల్ల కాకుండా విద్యార్థుల వల్లే తెలంగాణకు చట్టబద్ధత వచ్చిందని గుర్తుచేశారు&period; వారి త్యాగాలకు ప్రతిరూపంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఇక మహబూబ్ నగర్‌ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా సెల్ కారిడార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు సీఎం రేవంత్&period; పాలమూరు రైతులకు త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు&period; పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల నీటి కేటాయింపు కోసం ప్రయత్నిస్తున్నామని&period;&period;డిండి ప్రాజెక్టులో 30 టీఎంసీల కేటాయింపు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు&period; దేశానికి తెలంగాణ నుంచి 5 శాతం జీడీపీ వెళ్తుందని&period;&period; 10 శాతం జీడీపీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.