మెదక్‌ జిల్లాలో కల్తీపాల కలకలం.

మెదక్‌ జిల్లాలో కల్తీపాల కలకలం

Advertisements

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు&period; విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు&period; దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు&comma; పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్&comma; పాలు తయారీలో ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు&comma; మిక్సింగ్ సామగ్రి&comma; ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు&period; ఈ కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు&quest; ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా&quest; ఎంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది&quest; అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్&comma; స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు&period; కల్తీ పాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉండటంతో&comma; ఈ ఘటనపై అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు&period; దర్యాప్తు అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు&comma; నిందితుల పాత్ర&comma; సరఫరా నెట్‌వర్క్‌పై సమగ్ర సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు&period; ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా&comma; ఆహార పదార్థాల్లో కల్తీపై అధికారులు మరింత కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.