మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన.

Advertisements

<p>రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఘట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి&period; శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు&comma; కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period;ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్&comma; మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి&comma; డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు&period; రాహుల్ గాంధీ అరెస్టును వారు తీవ్రంగా ఖండిస్తూ&comma; ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆరోపించారు&period;ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయడం తగదని&comma; ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు&period; రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.