హైదరాబాద్‌లో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం.

Advertisements

<p>హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు&period; బ్రాహ్మణుల ఆర్థిక&comma; సామాజిక&comma; రాజకీయ భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు&period; బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం&comma; వారికి జరుగుతున్న అన్యాయాలపై అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు&period; బ్రాహ్మణులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు&period;ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తిని తెలంగాణ ఇన్‌చార్జిగా&comma; అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు&period;తెలంగాణలో బ్రాహ్మణులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ద్రోణంరాజు రవికుమార్ విమర్శించారు&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండగా&comma; ప్రస్తుతం తెలంగాణలో ఆ సంఖ్య ఒక్కరికే పరిమితమైందన్నారు&period;ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం నాలుగు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.