తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.

Advertisements

<p>ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; పోర్టల్ రూపకల్పన నుంచి టెండర్ల వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది&period;ధరణి పోర్టల్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది&period;మాజీ డీజీపీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది&period;వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా&comma; టెండర్ నిబంధనలు సక్రమంగా పాటించారా అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీయనుంది&period;అలాగే డేటా భద్రత&comma; గోప్యత ఉల్లంఘనలు&comma; పోర్టల్ రూపకల్పనలోని లోపాలు&comma; అనధికార లావాదేవీలు&comma; ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై కూడా విచారణ చేపట్టనుంది&period;ధరణి పోర్టల్ నిర్వహణలో విదేశీ సంస్థల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ స్పెషల్ ఎంక్వైరీ టీమ్ దర్యాప్తు చేయనుంది&period;విచారణ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్న ఈ బృందం&comma; అవసరమైతే మధ్యంతర నివేదికను కూడా అందించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.