సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.

Advertisements

<p>సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం బీజేపీ కార్యకర్తలకు&comma; పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని వేడెక్కించింది&period; రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే అక్కడకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు తమ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; అధికారిక కార్యక్రమంలో రాజకీయ నినాదాలు చేయవద్దంటూ అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించారు&period; పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది&period; పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు&period; ఈ క్రమంలో పోలీసులు&comma; బీజేపీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది&period; పోలీసులు తమపై భౌతిక దాడికి దిగారని&comma; చేయి చేసుకున్నారని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఆరోపించారు&period; కొద్దిసేపు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులు&comma; స్థానికులు ఆందోళనకు గురయ్యారు&period; చివరకు పోలీసులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.