ములుగు జిల్లా ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాల ప్రారంభం.

Advertisements

<p>ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; మంత్రి సీతక్క&comma; జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నూతన సదరం శిబిరం&comma; యూడీఐడీ భవనం&comma; ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు అర్థో&comma; గైనకాలజీ&comma; జనరల్ సర్జరీ&comma; ఈఎన్‌టీ విభాగాలకు సంబంధించిన నాలుగు ఆధునిక ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు&period; ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించామని మంత్రి సీతక్క తెలిపారు&period; త్వరలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు&period; మెడికల్ కళాశాల&comma; నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని&comma; జిల్లా ఆసుపత్రిపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మరో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు&period; విద్య&comma; వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.